Header Banner

సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!

  Tue Apr 22, 2025 20:57        Cinemas

హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది. టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి.

కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత , కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. ''సిటాడెల్'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌ ద్వారా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది.ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌లో ఓ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో సమంత చేతికి కొత్తగా ఉంగరం దర్శనం ఇచ్చింది. ఇటీవలే సమంత నిర్మాతగా మారి శుభం అనే సినిమాను తెరకకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంత చేతికి ఉంగరం కనిపించింది. దీంతో రహస్యంగా సమంత ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలోనే సమంత తిరుమతికి వెళ్లడం, ఆమెతో పాటు రాజు నిడుమోరు కూడా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అయితే తమ రిలేషన్‌పై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు సమంత చేతికి ఉన్న రింగ్‌తో పాటు, రాజు నిడుమోరుతో కలిసి తిరుపతి వెళ్లిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!

 

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

నేడు భారత్ లో అడుగు పెట్టనున్న ఆంధ్రా అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు.. మోడీతో భేటీ - ఏపీలో ఆ జిల్లాకి రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారు..

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #samantha #engagement #secrete #thirumala #ttd #relationship #bollywood